వేధింపులు లేవని చెప్పలేను..!

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చించింది ఈ బొద్దుగుమ్మ. ఆమె సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడినా, అవకాశాలు వస్తూనే ఉండడానికి కారణం రాశీఖన్నా వ్యక్తిత్వమే. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న రాశీఖన్నా. తన ‌హావభావాలతో ఒక్కసారిగా అబ్బాయిలను తనవైపు తిప్పుకున్న ఈ భామ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

మీకేప్పుడైనా చిత్ర పరిశ్రమలో వేధింపులు ఎదురయ్యాయా అనే ప్రశ్నకు బదులుగా.. నిజంగా.. వాళ్లు ఎదుర్కొంటున్న చేధు అనుభవాలను బయటకొచ్చి చెప్పడం చాలా గ్రేట్‌. వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకోచ్చు. ‘మీటూ’ అంటూ నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో ఇక్కడికి వచ్చాను. అప్పటినుంచి ఇప్పటివరకూ అన్నీ మంచి అనుభవాలే. ‘టాలీవుడ్‌ ఈజ్‌ వన్నాఫ్‌ ది బెస్ట్‌ ఇండస్ట్రీస్‌’. ఇక్కడ చాలా గౌరవిస్తారు. అలాగని వేధింపులు లేవని నేను స్పష్టంగా చెప్పలేను.

leave a reply