శంకర్ వద్దంటుంటే.. కమల్‌ కావాలంటున్నాడా..?

దాదాపు 23 ఏళ్ల తరువాత శంకర్‌, కమల్‌ హాసన్ కాంబినేషన్లో భారతీయుడు-2 సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఈ సినిమా ద్వారా మొదటిసారిగా శంకర్‌, కమల్‌తో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు సంగీత దర్శకుడు అనిరుధ్‌. అదే ఊపులో ఇండియన్‌2 కోసం అదిరిపోయే ట్యూన్లు చేసే పనిలో పడ్డాడు ఈ యువ తరంగం. అయితే.. ఈ చిత్రం కోసం అనిరుధ్‌ను వద్దని కమల్‌, శంకర్‌తో చెప్పినట్లు కోలీవుడ్‌ టాక్‌ వినిపిస్తోంది. మొదటి భాగం కోసం పనిచేసిన రెహ్మాన్‌నే తీసుకుందామని కమల్‌ సూచించాడట. ఈ విషయంలో శంకర్‌, కమల్‌ల మధ్య మాటలు జరుగుతున్నాయని సమాచారం.

1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా విజయంలో ఏఆర్‌ రెహ్మాన్‌ పాత్ర చాలానే ఉంది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటాయి. ఇక బ్యాక్‌ గ్రైండ్‌ కూడా అప్పట్లో అదిరిపోయేలా ఇచ్చాడు రెహ్మాన్‌. దీంతో రెండో భాగానికి కూడా అతడినే తీసుకోవాలని కమల్‌ అనుకుంటున్నాడట. అయితే.. 2.0 విషయంలో శంకర్‌, రెహ్మాన్‌ల మధ్య గొడవలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ చిత్రం కోసం శకంర్‌ ఆశించిన స్థఆయిలో రెహ్మాన్‌ ట్యూన్స్‌ ఇవ్వలేదని.. ఆ ట్యూన్స్‌ ఇవ్వవడానికి అతడు చాలా సమయమే తీసుకున్నాడని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. అందుకే ఇండియన్‌ 2 కోసం రెహ్మాన్‌ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా.. శంకర్‌, రెహ్మాన్‌ల మధ్య వివాదాలు కొత్తవేం కాదు. బాయ్స్‌ చిత్ర షూటింగ్‌లోనే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిన్టలు అప్పట్లో టాక్‌ బాగా వినిపించింది. దీంతో.. శంకర్‌ తెరకెక్కించిన ‘అపరిచితుడు’కు హారీశ్‌ జైరాజ్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ తీసుకున్నాడు. ఆ తరువాత మళ్లీ కలిసిన ఈ ఇద్దరూ పలు హిట్లను వాళ్ల ఖాతాలో వేసకున్న విషయం విదితమే.

leave a reply