సినిమా టికెట్‌పై..నేటి నుంచి అమలు!

దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో బి.జె.పికి వ్యతిరేకంగా ఉండటంతో కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే కేంద్రం జి.ఎస్.టిని తాగించడానికి చూస్తుంది. సామాన్యులకు నూతన సంవత్సర కానుకగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. అయితే ఈ మంగళవారం నుంచే సినిమా టికెట్లు, టీవీల ధరలు తగ్గే అవకాశాలున్నాయని తెలుస్తుంది. 23 రకాల వస్తువులు, సేవలపై జీఎస్టీ తగ్గిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

రూ.100 పైబడి ఉన్న సినిమా టికెట్‌పై గతంలో 28% పన్ను అమలు పరుస్తుండగా ఇపుడు 18% శాతానికి తగ్గించడం జరిగింది… మరియు రూ.100లోపు టికెట్‌పై పన్నుభారం 18% నుంచి 12%కి తగ్గించబడింది. కంప్యూటర్‌ మానిటర్లు, 32 అంగుళాల టీవీ స్క్రీన్లపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల సామాన్య ప్రజలకు లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

leave a reply