శాడిస్ట్‌ ‘నిహారిక’

అల్లరి పిల్లగా పేరుతెచ్చుకున్న నిహారిక నటించిన కొత్త సినిమా ‘సూర్యకాంతం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. అయితే.. ఇందులో ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌గా, క్యూట్‌గా, శాడిస్ట్‌లా అందరినీ ఏడిపిస్తూ దర్శనమిచ్చింది కొణిదెల నిహారిక. ఈ సినిమాలో రాహుల్‌ విజయ్‌, నిహారిక జంటగా నటించారు. బి. ప్రణీత్‌ దర్శకత్వం వహించగా.. యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ నిర్మాతగా వ్యహరిస్తున్నాడు. ఈ టీజర్‌ను చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయమని పిస్తుంది.

కాగా.. టీజర్‌లో ‘మీ పేరేంటండి’ అని రాహుల్‌ నిహారికను అడిగితే.. ‘నా పేరు తెలుసుకుని ఏం చేస్తావ్‌? నీకు పుట్టబోయే పిల్లలకి పెట్టుకుంటావా?’ అని వెటకారంగా అనడం నవ్వు తెప్పిస్తోంది. ఆ తర్వాత ‘నీ గురించి చెప్పు’ అని నిహారిక రాహుల్‌ను అడుగుతుంది. టీజర్‌‌ చివర్లో ‘ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిజంగానే చెయ్యి కోసుకుంటాను’ అని నిహారిక తల్లి పాత్రలో నటించిన సుహాసిని బెదిరిస్తుంటారు. నిహారిక ఆమెను ఆపాల్సిందిపోయి ‘12345..కోస్కో’ అంటూ రెచ్చగొట్టడం కామెడీగా ఉంది. కాగా.. మార్చి 29కి ఈ సినిమా థియేటర్స్‌లోకి వస్తున్నట్లు టీజర్‌లో తెలిపారు.

leave a reply