శ్రీ మురుడేశ్వర స్వామి

కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్రం మురుడేశ్వరం. ఇది ప్రాచీన పుణ్య క్షేత్రంగానే కాదు, విహారయాత్రకూ ప్రసిద్ధి చెందిన పుణ్య ప్రదేశం. ఈ క్షేత్రం కర్ణాటకలోని భట్కల్‌ ప్రాంతంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన శివుని విగ్రహం ఈ క్షేత్రంలో ఉంది. ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది. మూడు వైపుల అరేబియా సముద్రం ఆవరించి ఉంటుంది.

చరిత్రప్రకారం.. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. అప్పుడే శివుడు ఒక షరతును కూడా చెప్తాడు. స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు. ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. బ్రాహ్మణ వేషంలో రావణుడి వద్దకు వినాయకుడు వెళ్లగా.. బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు. రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం. ఈ పేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు ఏంటే.. దేశంలోనే అతి పెద్ద రాజగోపురం 20 అంతస్తులు ఉంటుంది. శివుడికి ప్రత్యేక పూజా విధానాలు త్రికాల పూజలు యథావిధిగా నిర్వహిస్తారు. గోపుర గోడలపై ద్రావిడ శైలిలో చెక్కిన సుందరమైన శిల్పాలను చూడవచ్చు. ఇక్కడి శిల్ప సౌందర్యం, ప్రకృతి రమణీయత, ప్రశాంత వాతావరణం భక్తుల హృదయాల్లో చెరగని మధురానుభూతిని నింపుతాయి.

leave a reply