శారీరక శ్రమతో..ఆరోగ్యం!

ఆరోగ్యవంతమైన జీవనం పొందాలనుకుంటున్నారా.. అయితే శారీరక శ్రమ అలవాటు చేసుకుంటే చాల ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాకుండా మానసిక స్థితి కూడా మెరుగు పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని జాన్స్‌ హోప్‌కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న కొంత మందిని  రోజువారీ కార్యకలాపాలను ఒక ట్రాకర్‌ సాయంతో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. రోజు శారీరక శ్రమ చేసే వారిలో మానసిక స్థితి మెరుగు పడుతుంది అని అంతేకాక.. వీరు రోజులో ఎక్కువ సమయం శారీరక శ్రమ చేయడం వల్ల మానసిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

కొంతమంది మానసిక స్థితి గురించి వివరిస్తూ.. వారు  ఉన్నట్టుండి ఆత్మస్థిర్యాన్ని కోల్పోవడం. అప్పటివరకూ సంతోషంగా, హుషారుగా ఉన్న వారు.. వెంటనే ఏదో కోల్పోయిన వారిలా మారిపోతారు. శారీరక శ్రమతో ఇలాంటి వారి మానసిక స్థితి మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.శారీరక శ్రమతో ఒత్తిడిని కూడా అధికమించవచ్చు.

leave a reply