ఇవి తీసుకుంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు!

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉంటామని తెలిపారు.  ఇవి తీసుకుంటే ఏదో కోలోయినా భాద నుంచి బయట పడితే ఎలా ఉంటుందో అంత కంటే రెట్టింపు ఉత్సహంతో ఉంటామని, ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుందని తాజాగా జరిపిన అథ్యయనంలో తేలింది.

మనం తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు సగానికి పైగా తీసుకుంటే గుండెకు మంచిదని అంతేకాక మానసికంగానూ ధృడంగా ఉంటారని ఈ అథ్యయనం తెలిపింది. వీటిలో ఎక్కువగా యాపిల్స్‌, క్యారెట్‌, అరటిపండ్లు మానసిక ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయని ఈ అథ్యయనంలో తేలింది. క్రమం తప్పకుండ రోజూ తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను తొలగిస్తే మీ మానసిక స్థితి కుంటుపడుతుందని, ఏదో కోల్పోయిన వారిలా నిరాశగా  తయారవుతారని పరిశోధకులు తెలియచేసారు.

పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకునే వారి మానసిక ఆరోగ్యం స్వల్పకాలంలోనే ఉల్లాసంగా మారుతారని, తమ అథ్యయనంలో వెల్లడైందని తెలిపారు. ఈ అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్‌ రీసెర్చి ఫెలో నీల్‌ ఓషన్‌ చెప్పుకొచ్చారు. దాదాపు కొన్ని వేల మందిపై తాము జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయని నీల్‌ పేర్కొన్నారు.

leave a reply