మీడియాతో…యువరాజ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్: పొట్టి క్రికెట్అనగానే ముందు గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ ఎవరు అంటే యూవీ పేరు చెప్తారు. కానీ ఈ సారి వేలంలో చివరిదాకా మిగిలిన క్రికెటర్ గా ఉన్నాడు. పోయిన సీజన్లో ఏకంగా 16 కోట్లకు పైగాపలికిన యూవీని ముంబై కోటికి దక్కించుకుంది. దీని గురించి యువరాజ్ మీడియాతో మాట్లాడుతూ… తొలి దశలో నా పేరు లేనందుకు నాకేం బాధగాలేదు. ఎందుకంటే దానికి గలకారణమేంటో నాకు తెలుసు. ఐపీఎల్‌ వేలంలో వివిధ ఫ్రాంఛైజీల చూపంతా యువ క్రికెటర్లపైనే ఉంటుంది. దూకుడు మీదున్న క్రికెటర్లనే వాళ్లు తొలుత కొనుగోలు చేస్తారు. నాకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. నా కెరీర్‌ తొలి నాళ్లలో ఐపీఎల్‌ వేలంలో నాకు మంచి డిమాండ్  ఉండేది. ఈ ఐపీఎల్‌లో ఏదో ఒకఫ్రాంఛైజీ దక్కించుకుంటుందని నేను ముందే ఊహించా. ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌జట్టులో నేనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ ఉంటారు. మెంటార్‌గా సచిన్‌, కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఉన్నారు. ఈముగ్గురితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆకాశ్‌ అంబానీ నా మీద ఎంతో నమ్మకం ఉంచారు. దాన్ని నేను నిలబెట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు.

 ఐపీఎల్‌-12 వేలంలో చివరివరకూ అమ్ముడు పోకుండా ఉన్న యువరాజ్‌సింగ్‌ను.. ముంబయి జట్టు ఆఖరి నిమిషంలోదక్కించుకుంది. సిక్సర్ల హీరోగా పేరొందిన యువీని కొనడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో యువీ అందరి దృష్టిలో పడ్డాడుు. క్రికెట్‌ విశ్లేషకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే  దీనిపై యువీ మీడియాతో స్పందించాడు.యువి రాకతో ముంబైలో కొత్త ఉత్స్తాహం వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

leave a reply