అన్నం తింటున్న… బరువు తగ్గొచ్చు!

సాధారణంగా చాలా మంది బరువు తగ్గాలని , అన్నం తినకుండా ఉంటే బరువు తగ్గొచ్చని అన్నం తినడం మానేస్తుంటారు.. అయితే అన్నం తినడం మానకుండా  కూడా బరువు తగ్గొచ్చు. అయితే ఇందుకు కొంత అవగాహన కలిగి ఉండాలి. అన్నం తినడం మంచిదే. కొన్ని సమయాల్లో అన్నం తింటే జీర్ణక్రియ బాగుంటుంది. పగటిపూట అన్నం ఎక్కువగా తినొచ్చు. అల్పాహారం తీసుకున్న అనంతరం ఆకలివేసినప్పుడు అన్నం తినడం మంచిదే. అంతేకాకుండా దీనివల్ల బరువు ఎక్కువగా పెరగరు.

పగటిపూటనే  అన్నం తినడం వల్ల అది పూర్తిగా జీర్ణమై శరీరానికి శక్తిని అందించగలదు. ఈ సమయంలో తింటే కొవ్వు కూడా ఎక్కువగా పెరగదు. ఎక్కువ శాతం మంది తెల్ల బియ్యంతో తయారుచేసిన ఆహారాన్నే తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ రైస్ తో తయారు చేసిన అన్నాన్ని తినడానికి పెద్దగా ఇష్టపడరు. చాలా మంది తెల్ల రైస్ తో తయారు చేసిన అన్నాన్నే తినడానికి ఇష్టపడతారు. అయితే తెల్ల అన్నం కంటే బ్రైన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాక, బరువు పెరగడం తగ్గుతుంది. దీంతో కొవ్వు కూడా కరుగుతుంది.

బియ్యంతో తయారు చేసిన అనేక పదార్థాలను మనం ప్రతిరోజు అల్పాహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది. ఇడ్లీలు, పూరీలు, రొట్టెలు, దోసె రెగ్యులర్ గా తినడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.  

leave a reply