సెల్ఫీలతో కొత్త ముప్పు!

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు. దీనిని ఒక కొత్త రోగంగా పరిగణిస్తున్నారు.  ఈ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమేనా పెరుగుతోందని, ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయని ‘ఫాక్స్ న్యూస్’ సంస్థ పేర్కొంది.  దీన్ని ‘కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్’ అనే రోగంగా చెప్తారు. చేతిని పదే పదే ఒకే స్థితిలో ఉంచినప్పుడు కార్పాల్ ఎముకల నుంచి వెళ్లే ప్రధాన నరాల వ్యవస్థ ఒత్తిడికి లోనవ్వుతుంది. ఫలితంగా మణికట్టు, చేతి వేళ్లు తీవ్రంగా నొప్పికి గురవుతాయని తెలిపారు. దీనివల్ల తిమ్మిరిలు, నొప్పి వంటివి వస్తాయని తెలిపారు.

సెల్ఫీ తీసుకునే సమయంలో మొబైల్‌ లేదా సెల్ఫీ స్టిక్‌ను ఎక్కువ సేపు పట్టుకోవడం, పదే పదే అటూ కదల్చడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనివల్ల రోగులు మణికట్టు నొప్పితో బాధపడతారని, సెల్ఫీలతో ఎక్కువ సేపు గడిపేవారికి ఇది దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం కూడా ఉందని వైద్యులు తెలియచేసారు.

సెల్ఫీలను తీసుకునే క్రమంలో కొంతమంది కాళ్లు, చేతులను పోగొట్టుకుంటున్నారని తెలిపారు. సెల్ఫీ మోజుతో రాళ్ల మీద నుంచి దూకడం లేదా సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో చేతులతో బలమైన వస్తువులను ఢీకొట్టడం వల్ల తీవ్రంగా గాయపడుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఇప్పటివరకు 250 సెల్ఫీ మరణాలు సంభవించినట్లు తెలిపారు. దీంతో వీలైనంత వరకు సెల్ఫీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

leave a reply