షమీ ఇంగ్లీష్‌కు… కామెంటేటర్ ఫిదా!

న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో కోహ్లిసేన వశమైంది. ఈ మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్‌ షమీ(3/41)కి మ్యాన్‌ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది. అయితే షమీకి అవార్డు ప్రధానం చేసే సమయంలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. షమీ ఎప్పుడు మాట్లాడిన హిందీలోనే మాట్లాడటం సహజం .. కానీ, ఈ సారి ఇంగ్లీష్‌లో మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. తొలి మ్యాచ్లో  మాన్ అఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన షమీకి మాట్లాడాల్సిన  సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సాయం అందించాడు. అప్పుడు షమీ హిందీలో మాట్లాడగా..  దానిని కోహ్లి ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. అదేవిధంగా నిన్న కూడా షమీ వెంట అనువదించడానికి కోహ్లి వచ్చినప్పటికి.. షమీ అతని సాయం తీసుకోకుండా  ఇంగ్లీష్‌లో మాట్లాడి ఆకట్టుకున్నాడు.

షమీ ఇంగ్లీష్‌కు స్పందిస్తూ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న మాజీ పేసర్‌ సిమన్‌ డౌల్‌ “షమీ యువర్‌ ఇంగ్లీష్‌ బహుత్‌ అచ్చా.. అభినందనలు” అని హిందీలో ప్రశంసించాడు. ఈ సంభాషణలో న్యూజిలాండ్‌లో వీచే ఎదురుగాలికి బౌలింగ్ చేయడం ఎలా అనిపించిందని షమీని సిమన్‌ అడగగా. దీనికి షమీ ధైర్యం చేసి ఇంగ్లీష్‌లో ‘నిజానికి ఎదురుగాలుల్లో బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. కానీ సాధ్యమయ్యేదే. మరో ఎండ్‌ నుంచి భువనేశ్వర్‌ సాయం అందించాడని, షమీ సమాధానమిస్తూ.. సరైన సమయంలో సరైన ప్రదేశంలో బంతులను వేయగలిగితే  చాలని పేర్కొన్నాడు.

leave a reply