మహేష్‌బాబు ఆఫీసులో…తనికీలు!

టాక్స్ ఎగవేతపై హీరో మహేష్‌బాబుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన జి.ఎస్.టి అధికారులు అయన దగ్గర నుంచి రూ. 42 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు జీఎస్టీ అధికారులు అయన ఆఫీసులో కూడా సోదాలు నిర్వహించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇంకా ఆయన నుంచి రూ. 31 లక్షలు రాబట్టాల్సివుందని చెప్పారు. మొత్తం రూ. 73 లక్షలు పన్ను బకాయి చెల్లించాల్సివుందన్నారు. మిగిలిన 31లక్షల రూపాయలను రికవరీ చేసేవరకు అయన బ్యాంకు ఖాతాలు జి.ఎస్.టి కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేసి ఉంటాయని వివరించారు.

ఇక ఈ విషయంపై మహేష్‌ అభిమానులు కలవరపడుతుంటే, ఆయన మాత్రం హ్యాపీగా హ్యాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌చేస్తున్నారు. దీనికి సంబంధించి … అయన క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలకు విదేశాలకు వెళ్లి ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నట్లు సమాచారం. ఇక్కడేమో పన్నులు కట్టలేదనీ​, ఆయన ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్‌ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏమాత్రం స్పందించకుండా మహేష్‌ హాలిడేను ఎంజాయ్‌ చేసేస్తున్నారు. జాలీగా హాలిడే ట్రిప్‌కు సంబంధించిన పిక్‌ను కూడా అయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

leave a reply