బసవతారకమ్మ..ఎలా ఉందొ చూసారా?

నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. బాలకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈచిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్నప్రధాన పాత్రాధారులందరికి సంబంధించిన లుక్‌లు బయటకు రాగా.. తాజాగా ఎన్టీఆర్ భార్య బసవతారకం ఫస్ట్‌లుక్ బయటకు వచ్చింది. ఈ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తుండగా.. హర్మోనియం వాయిస్తూ ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ లుక్‌తోపాటు ఎన్టీఆర్ పోషించిన రావణాసురుడి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రివీల్ చేశారు. అందులో సినిమా పరంగా ఎన్టీఆర్‌కు సంబంధం ఉన్న కొందరి ప్రముఖుల పాత్రలు ఉన్నాయి. కాగా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కగా.. మొదటి భాగం(యన్‌టిఆర్-కథానాయకుడు) ఆడియో, ట్రైలర్ రేపువిడుదల కానున్న విషయం తెలిసిందే.

leave a reply