సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏకు ఎదురుదెబ్బ..!

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌కు భాగస్వామిగా ఉన్న ఆర్ఎస్ఎల్‌పీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుషవాహ ఎన్డీయే నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ‘మహాకూటమి’లో చేరినట్టు ఆయన ప్రకటించారు. బీహార్‌లో సామాజిక న్యాయాన్ని తాము కోరుతున్నామని, రాష్ట్ర ప్రజల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కుషవాహ తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు. మోదీ, నితీష్ కలిసి బీహార్‌ను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. తనను మహాకూటమిలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. మహాకూటమిలో కుషవాహ చేరికను ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తదితరులు స్వాగతించారు. అవామీ మోర్చా నేత జితిన్ రామ్ మాంఝీ, కాంగ్రెస్ నేత శక్తికాంత్ గోహిల్, శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

leave a reply