లేడీ ఓరింయంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఈ చెన్నై భామ. దక్షిణాదిలో అగ్ర హీరోయిన్గా నయన్ సక్సస్ అయ్యింది. నయన్ సాధారణంగా ఆడియో లాంచెస్, ప్రీరిలీజ్ ఫంక్షన్స్‌కు, సక్సెస్ మీట్లకు చాలా దూరంగా ఉంటారు. అలాగే.. మీడియాకు కూడా చాలా తక్కువ ఇంటర్య్వూలు ఇస్తుంది. ఎందుకంటే.. ముందే ఆవిడ సినిమా కంటెంట్ చెప్పాస్తాననేది నయన్ అభిప్రాయం. అందుకే తను దూరంగా ఉంటానని చెప్తూ ఉంటుంది.
అయితే.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం నయనతార తన రూల్స్‌ను పక్కన పెట్టినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో నయన్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నయన్‌ను ఈ సినిమా ప్రొడ్యూసర్ రామ్‌చరణ్ ఒప్పించినట్లు తెలిసింది. కాగా.. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ను తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమితాబచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ చేయగా.. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ దీన్ని నిర్మిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.