ప్రస్తుతం తమిళ హీరో విశాల్ ‘అయోగ్య’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కాగా.. ఇది తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాకి రీమెక్. సన్నివేశానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్లో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ అయిన సన్నీ లియోన్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతో సన్నీతో ఐటమ్ సాంగ్ చేయించడానికి ఈ చిత్ర యూనిట్ సన్నీతో మాట్లాడారు.
అయితే.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మరోవైపు కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చారిత్రక కథా చిత్రం ‘వీరమహాదేవి’లో సన్నీ నటిస్తోంది. అయితే, వీరమహాదేవి పాత్రను సన్నీ పోషిస్తుండటాన్ని కన్నడ, తమిళ ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారట.. కాగా.. ఇప్పటికే దీనికి సంబంధించి ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య విశాల్ సినిమాలో సన్నీ కనిపించడం ఎటు దారి తీస్తుందో.. చూడాలి.