సలాడ్స్‌తో …ఆరోగ్యం!

శరీరానికి సలాడ్స్‌ అనేవి అత్యంత ఆరోగ్యకరమైనవి. ఇవి తీసుకోవడం వల్ల  ఆకలిని తట్టుకోవడమే కాక, శరీరానికి అవసరమైన విటమిన్స్‌, పీచుపదార్థాలు ఇందులో ఉంటాయి.  సలాడ్స్‌ నుంచి బోలడన్ని యాంటీ ఆక్సిడెంట్స్‌ లభిస్తాయి. ఇవి ముఖ్యంగా డైట్‌ చేస్తున్నప్పుడు ఎలా తీసికోవాలో చూద్దాం.

మనం తీసుకునే సలాడ్స్ లో పచ్చి కాయగూర ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసంను కలిపి భోజనంతో పాటు తీసుకుంటే మంచిది. ఇలా తినడం వల్ల ఆహారం సమతుల్యం అవుతుంది. ఇలా చేయడం వల్ల భోజనం మోతాదు తగ్గి  పోషకాలు ఎక్కువగా అందుతాయి. అందుకే సలాడ్స్‌ భోజనంతో పాటు తింటే బరువు తగ్గే అవకాశం ఉంది. వీటిలో కీర, దోసకాయ, టొమాటో, క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికమ్‌, ఉల్లి, కొత్తిమీర సలాడ్స్‌లో కలిపి తీసుకుంటే మంచిది.

బెండకాయలు, దొండకాయలు, చిక్కుడు, బీన్స్‌, ఆలుగడ్డ, స్వీట్‌ పొటాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ మొదలైన కూరగాయలు సలాడ్‌లో తీసుకోవాలనుకుంటే, ఆ పూట భోజనం మానేసి కేవలం సలాడ్‌ మాత్రమే తీసుకోవాలి. కొన్ని కాయగూరల్ని ఉడికించి, లేక మగ్గించి సలాడ్‌ రూపంలో తీసుకోవచ్చు. తాజా కూరగాయల సలాడ్స్‌ తీసుకుంటున్నప్పుడు కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ స్ర్పే చేసుకోవచ్చు.

సలాడ్స్‌ తినడం వల్ల  జీర్ణకోశం శుభ్రపడుతుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సలాడ్స్ తినడం కొంచం ఇబ్బందిగా అనిపిస్తే అందులో సోయా సాస్‌, చిల్లీ సాస్‌, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా వేసుకొని రుచిగా మార్చుకోవచ్చు.

leave a reply