వయసు పైబడే వారికి… చేపలు!

వయసు పైబడే వారిలో ఎక్కువగా భాధించేవి అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, వాపులు వంటి జబ్బులు. వీటి కోసం ఏవో ఒకటి రెండు మాత్రలు వేసుకోవడంతోనే పరిస్థితి చక్కబడితే ఫరవాలేదు గానీ, అలా కాకుండా రోజూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నా ఫలితం కనపడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మందులతోనే నయం అవుతాయని అనుకోకుండా, మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా ఆహారంలో చేపల్ని చేర్చుకోవడం మంచిదని పరిశోధకులు అంటున్నారు.

గుండె పనితీరును పరీక్షించేదుకు పురుషుల్లో సగటున 74, స్త్రీలల్లో 63 ఏళ్లున్న కొంతమందిని తీసుకుని పరిశీలించగా. ఏ వృద్ధుల రక్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాిసిడ్స్‌ అత్యధికంగా ఉన్న వారిలో ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా నిలకడగా ఉన్నట్లు  కనుగొన్నారు. అందుకు కారణం వాళ్లు చేపల్ని ఎక్కువగా తినడమే అని వారి అధ్యయనాల్లో తేలింది. అందువల్ల వృద్ధుల్లో వచ్చే ఈ రక్తపోటు, గుండెజబ్బులు, తరుచూ వచ్చే నొప్పులు, వాపులకు తరచూ చేపలు తినడం ఒక పరిష్కారంగా చెబుతున్నారు. పెద్ద వయసులో కూడా అతి సులువుగా జీర్ణమయ్యే చేపల్ని తినమంటే మంచిదని తెలియచేసారు.   

leave a reply