అది నా డ్రీమ్‌…గంభీర్!

గౌతం గంభీర్‌ భారత క్రికెట్‌ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఓపెనర్ గా ఎక్కువ సార్లు సేవలందించిన గంభీర్, ధోని కెప్టెన్సీలో గెలిచిన ప్రపంచకప్ లలో  సభ్యుడుగా ఉన్నాడు. టీమిండియా గెలిచిన రెండు వరల్డ్‌కప్‌(2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌)ల్లో గంభీర్ చేసిన పరుగులే కీలకం కావడం విశేషం. ఈ రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ టాప్‌ స్కోరర్‌గా గంభీర్‌ నిలవడం మరో విశేషం. 2007 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 75 పరుగుల చేసిన గంభీర్, 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లోను 97 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

దీనిపై గంభీర్ స్పందిస్తూ… భారత్ క్రికెట్‌ జట్టు వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండటమనేది తన చిన్ననాటి కలగా చెప్పుకొచ్చాడు. ఎప్పుడైనా ఒక్కసారి నా క్రికెట్‌ కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే చాలు, నేను సాధించిన విజయాలే నాకు గర్వకారణమన్నాడు. తన చిన్నతనంలో భారత్‌ జట్టు తొలి వరల్డ్‌కప్‌ అందుకుందని, అప్పటినుంచి వరల్డ్‌కప్‌ గెలిచే భారత జట్టులో ఉండాలనేది తన డ్రీమ్‌గా పేర్కొన్నాడు. ఆ కలతోనే చాలా సందర్భాల్లో ఊహించుకుంటూ ఉండేవాడినన్నాడు. ఆ విషయంలో మా బామ్మ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేది… అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. నేను జీవితంలో సాధించిన గొప్ప ఘనత ఏదైనా ఉందంటే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యునిగా ఉండటమే. అది రెండుసార్లు నెరవేరినందుకు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని మాజీ క్రికెటర్‌ గంభీర్ తెలిపాడు.

leave a reply