బరువు తగ్గడం కోసం!

మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా అన్నంతో పాటు అందులోకి కూరలు, పప్పుల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకొవాలి. ఇలా కొన్నిరకాల పదార్థాలను నిత్యం తీసుకోగలిగితే… బరువు అదుపులో ఉండటమే కాదు, శరీరానికి శక్తి కూడా అందుతుంది. అంతేకాక త్వరగా పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు.

బరువును తగ్గించడానికి తోడ్పడే కూరగాయాల్లో ముల్లంగి ఒకటి. ఇందులో పొటాషియం, మాంగనీస్‌, విటమిన్‌ బి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ముల్లంగి నుంచి అందే కెలొరీలు కేవలం 16 మాత్రమే. కాబట్టి దీన్ని నిత్యం సలాడ్‌రూపంలో తీసుకోవడం మంచిది.

క్యారెట్ కూడా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. దీని నుంచి అందే పీచు త్వరగా జీర్ణం కాదు. దీంతో ఆకలి వేయడానికి  కొంత సమయం పడుతుంది. అలాగే విటమిన్‌ బి6, విటమిన్‌ కె, ఖనిజలవణాలు, యాంటి యాక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్పరస్‌ పోషకాలు ఎక్కువే. ఇవి మెదడును చురుగ్గా ఉంచడమేకాక, రోగనిరోధకశక్తీని కూడా పెంచుతాయి.  

leave a reply