సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య పెళ్లి సోమవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఎంఆర్సీ నగర్లో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్లో సౌందర్య, తమిళ నటుడు విషగన్ వనగమూడి పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి కూతురి గెటప్‌లో సౌందర్య మెరిసిపోయారు. కాగా.. ఈ వివాహానికి తమిళనాడు సీఎం పళనిస్వామి హాజరై సౌందర్య, విషగన్లను ఆశీర్వదించారు. అలాగే.. పలువురు ప్రముఖులు, నటులు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీప్రసన్న, కమల్ హాసన్, ధనుష్, ప్రభు, మణిరత్నం, సుహాసిని, రాఘవ లారెన్స్, తదితరులు హాజరయ్యారు.
ఘనంగా సౌందర్య రజనీకాంత్ వివాహం
