ఆపిల్ ఒక్కటి చాలు!

ప్రతి రోజు ఒక ఆపిల్‌ తింటే ఎన్నో లాభాలున్నాయని అంటుంటారు. ఆపిల్‌లోని పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. దీనిలో ట్రైటెర్పినాయిడ్స్‌ అనే పోషకాలు కాలేయ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌లను నివారిస్తాయని కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధనలో తేలింది. అంతేకాకుండా ఆపిల్‌ మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగానే అది మనకు అలై్జమర్స్‌ వ్యాధిని నివారించి మెదడుకు రక్షణనిస్తుంది. ఆపిల్‌లో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. ఈ పీచుపదార్థాల కారణంగా మలవిసర్జన సాఫీగా అయి, మలబద్దకం బారి నుంచి బయటపడేస్తుంది.

ఆపిల్‌లో పీచుపదార్థాల కారణంగా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గిపోతుంది. అలాగే ఆరోగ్యకరంగా బరువును నియంత్రించుకోడానికి ఆపిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆపిల్‌ మంచి డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌ కూడా. ఇది కాలేయంలోని విషాలను సమర్థంగా తొలగిస్తుంది. ఆపిల్‌లోని విటమిన్‌–సి వల్ల  శరీరంలోని స్వాభావికమైన రోగనిరోధకశక్తిని మరింత పెరుగుతుంది.

ఆపిల్‌ను తినడం వల్ల  శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోతుంది.  ఫలితంగా రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.   

leave a reply