లవంగంతో ఎసిడిటీకి చెక్!

మీకు ఎసిడిటీ సమస్య ఎక్కువగా వేధిస్తోందా, కడుపులో లేదా ఛాతిలో మంట ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారా… అయితే ఈ సమస్యకు లవంగంతో చెక్ పెట్టండి. ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల  ఈ సమస్య వస్తుంది. అంతేకాకుండా వ్యాయామం చేయకపోవడం, వేళకు తినకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తాగడం, ఒత్తిడి వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. ఇందుకోసం వంటల్లో విరివిగా వాడే లవంగంతో పరిష్కరించొచ్చు. తలనొప్పి, కేన్సర్లు, డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు, సైనస్, ఫ్లూ, జలుబు తదితర వ్యాధులు తలెత్తకుండా లవంగం ఉపయోగపడుతుంది. 

లవంగం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాక, కాలేయాన్ని సంరక్షించి, ఎముకలను ధృడంగా చేస్తుంది. లవంగాలను యాంటీ సెప్టిక్‌గా, నోటి సమస్యల పరిష్కారానికి, దుర్వాసనను అరికట్టడానికి కూడా ఉపయోగిస్తారు. టీ, జ్యూస్, స్వీట్లలో లవంగాన్ని ఉపయోగిస్తారు. 

లవంగం తినడం వల్ల నోట్లో లాలాజల ఉత్పత్తి పెరిగి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. కాబట్టి భోజనం ముగిశాక లవంగం నమలితే ప్రయోజనం ఉంటుంది. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఇది చూస్తుంది. నోట్లో లవంగం ముక్క ఉంచుకొని మెల్లగా నమలడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయి తగ్గి ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

leave a reply