బిడ్డకు పాలివ్వడం … ఇద్దరికీ క్షేమం!

బిడ్డకు పాలివ్వడం  తల్లి బిడ్డ ఇద్దరికీ మంచిదన్న సంగతి తెలిసిందే! అయితే ఎక్కువ కాలం బిడ్డకు పాలిచ్చే తల్లి భవిష్యత్తులో డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశాలు చాలా తక్కువని  అమెరికా యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు తెలియచేసారు. ఇందుకోసం 45 నుంచి 50 సంవత్సరాలు దాటినా తల్లుల మీద వీరు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేయగా కొన్ని విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. వీళ్లలో కొందరు తల్లులు తమ పిల్లలకు అస్సలు పాలివ్వలేదు. ఇంకొందరు ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు పాలిచ్చారు. ఇలా 50 సంవత్సరాల వయస్సులో వారి ఆరోగ్యాన్ని పరిశీలించగా వారిలో వచ్చే డిప్రెషన్ గురించి తెలియచేసారు.

వీరిలో ఎక్కువ కాలం పాలిచ్చిన తల్లుల్లో కేవలం తొమ్మిది శాతం మందిలో మాత్రమే డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపారు. అస్సలు పాలివ్వని వారు దీర్ఘకాలం నుంచి డిప్రెషన్‌కు లోనైనట్లు గుర్తించారు. ఇందుకు కారణం పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటొసిన్‌ హార్మోన్‌ విడుదలవుతుందనీ, ఈ హార్మోన్‌ మానసిక ప్రశాంతతకి దోహదం చేస్తుందనీ  వారు పేర్కొన్నారు. దీంతో తల్లులు తమ పిల్లలకు తల్లి పాలనే ఇస్తే ఇద్దరికీ మంచిదని తెలిపారు.  

leave a reply