చేతుల మృదుత్వం కోసం!

చాలా మంది ముఖం, జుట్టు మీద శ్రద్ద ఎక్కువగా తీసుకుంటారు. కానీ చేతులను సరిగా పట్టించుకోరు. అయితే చేతులకూ వార్థక్యపు ఛాయల సమస్య ఉంటుంది. ఇందుకోసం మొదట గోళ్లను చక్కగా కత్తిరించుకోవాలి. తరువాత కాస్తంత క్రీమ్‌ రాయాలి. పావుకప్పు పాలల్లో కాస్త అరోమానూనె, కొన్ని గులాబీరేకలు వేసి వేడి చేసుకోవాలి. ఈ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో చేతి వేళ్లను ఉంచాలి.  కొంచం సేపు అలాగే ఉంచి తరువాత తీసేసి మృతకణాలు పోయేలా శుభ్రం చేయాలి. తరువాత సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. దీంతో చేతిపై ఉండే మృతకణాలు పోతాయి.

అనంతరం కొంచెం తాజా క్రీమ్‌ తీసుకుని చేతులకు రాసుకుని మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల క్రీమ్‌ చర్మంలోకి ఇంకిపోతుంది. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసుకోవాలి. వీటిని చక్కెరలో ముంచి చేతులపై రాయడం చేయాలి. ఇలా చేస్తే వీటిలోని రసం, చక్కెర కలిసి చర్మంలోకి ఇంకుతుంది. తరువాత కడిగేయాలి. ఒక గిన్నెలో గంధం పొడి, తేనె, గులాబీ రేకల ముద్దను కలిపి చేతలకు రాసుకొని కాసేపు ఆగి కడిగేస్తే సరిపోతుంది. 

leave a reply