తంజావూర్‌ బృహదీశ్వర ఆలయం

బృహదీశ్వర ఆలయం హిందూ దేవాలయాల్లో ప్రాచీనమైన ఆలయం. ఇది తమిళనాడులో తంజావూరులో ఉంది. ఇది శివాలయం, దీనిని చోళులు 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. మొత్తం ఇండియాలోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తించారు.

చరిత్ర ప్రకారం: కుంజర మల్లన్ రాజరాజ పెరుంథాచన్ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని మొత్తం గ్రానైట్‌ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం కుంజర రాజరాజ పెరుంథాచన్ అనే సాంకేతిక నిపుణుడు మరియు వాస్తుశిల్పిచే చేయబడిందని ఆలయంలోని శాసనముల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని మొత్తం నిర్మించడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. ఈ ఆలయం మొక్క వాస్తు మొత్తం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించబడింది.

రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. కానీ తండ్రి మీద గౌరవంతో ఇతను ఆలయ గోపురాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు.

ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.

leave a reply