దేశమంతా… క్రిస్మస్‌!

క్రిష్ట‌మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా దేశంలో పండుగ వాతావరణం నెలకొంది.  ప్రేమ, కరుణకు ప్రతీక అయిన ఏసు క్రీస్తు పుట్టిన రోజు క్రిస్ మస్ పండుగ‌ను దేశవ్యాప్తంగా క్రైస్తవ భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చ్ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. క్రీస్తును ఆరాధిస్తూ కళాకారులు పాడుతున్న పాటలతో చర్చిల్లో సందడి కనిపిస్తోంది. క్రిష్ట‌మ‌స్ సంబరాలకు యావ‌త్ దేశం ముస్తాబైంది.

నగరాల్లో, గ్రామాల్లో అని తేడాలేకుండా క్రిస్ మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శాంటాక్లాజ్ లు, క్రిస్ మస్ ట్రీలతో సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రముఖ చర్చిలన్నీ  చక్కగా ,అందంగా ముస్తాబవుతున్నాయి. షాపింగ్ తో మార్కెట్ లు కిటకిటలాడుతున్నాయి. అటు పవిత్ర వారణాసిలో శాంటాక్లాజ్ లు సందడి చేశారు. పాపం చేసిన వాళ్లనూ క్షమించడం క్రీస్తు తత్వంలోని గొప్పదనం. అలాంటి ఏసు క్రీస్తు పుట్టిన రోజే క్రిస్ మస్. త్యాగం, సహనాలే కాదు, ఒకరికొకరు ప్రేమ, కరుణలు పంచాలన్న సందేశాన్ని ఇచ్చే ఈ పండగ దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.

క్రిస్మస్ అనగానే  అందంగా అలంకరించబడిన చెట్లు, స్టార్లు, బెలూన్లు, గ్రీటింగ్ కార్డులు గుర్తుకు వస్తాయి. దీనికీ ఓ కథ ఉంది.. యేసుక్రీస్తు  జన్మించినప్పుడు ఆకాశంలో తారలు దేదీప్యమానంగా వెలిగాయి. పువ్వులు అందంగా వికసించాయి. పండ్లతో చెట్లు ఫలాలనిచ్చాయి. ప్రక్రుతిలోని ప్రతిదీ పరవశించింది. కానీ క్రిస్మస్ ట్రీ ఏమంత అందంగా ఉండదు. స్టార్ల వెలుగును చూసి, పువ్వుల నవ్వులు చూసి తాను ఏమీ బాలేనని డల్ అయి పోతుందట క్రిస్మస్ చెట్టు. ఆకాశం నుంచి క్రిస్మస్ ట్రీ విచారం చూసిన నక్షత్రాలు చాలా బాధపడ్డాయి. వెంటనే నక్షత్రాలన్నీ చెట్టుపై వాలిపోయాయట. అందుకే క్రిష్ట‌మ‌స్ ప‌ర్వ‌దినాల్లో క్రిష్ట‌మ‌స్ చెట్టుకు కూడా మంచి ప్రాధాన్య‌తనిస్తారు క్రైస్త‌వులు

leave a reply