ఉత్కంఠ పోరులో ఆసీస్ పై భారత్‌ విజయం

ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది.ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గింది. ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో చివరి ఓవర్‌లో 11 పరుగులు చేయాల్సి ఉండగా యువ ఆటగాడు విజయ్ శంకర్‌ మ్యాజిక్‌ చేశాడు.ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో ముందంజలో ఉంది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 250 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (116) విలువైన శతకంతో మరియు విజయ్‌ శంకర్‌ (46) బాధ్యతాయుతమైన ఆటతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు .మిగతా ఆటగాళ్లు ఎవరు ఈ మ్యాచ్ లో సరిగా రాణించలేదు.

leave a reply