ఏపీ డేటా పోయిందని కేటిఆర్ కి ఏమైనా కల వచ్చిందా !.. లోకేష్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ చిలికి చిలికి గాలి వానగా తయారైంది. డేటా వ్యవహారంపై కేటీఆర్ స్పందించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా తెలుగు దేశం నాయకులు ఘాటుగా స్పందించారు. ఈ తరుణంలో కేటిఆర్ ను, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.

కేటీఆర్ గారూ, ఏపీ డేటా పోయిందని కలగన్నారా? తమ సమాచారం పోలేదని, ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని ఈసీ ప్ర‌క‌టించింది. మ‌రి ఏపీ డేటా పోయింద‌ని క‌ల ఏమైనా వ‌చ్చిందా?.. ఈ ఎపిసోడ్‌లో పోయింది ఏపీ డేటా కాదు, హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్” అని స్పందించారు. మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై పోలీసుల దాడి ఎలా జరిగింది?… అంటే మీరు ఏమైనా టైం మిషన్ ఎక్కినట్లున్నారు అని వ్యగ్యంగా వ్యాఖ్యలు చేశారు. మా డేటా ఎత్తుకెళ్లి.. ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటున్నారు.ల‌క్షల కోట్ల దొంగ‌తో స్నేహం మిమ్మ‌ల్నీ దొంగని చేసింది” అని లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

leave a reply