ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ వద్దని కొందరు మాజీలు డిమాండ్ చేస్తుండగా దీనిపై మాత్రం బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం చెబితే పాక్‌తో ఆడబోయేది లేదని బుధవారం బీసీసీఐ వెల్లడించింది. కానీ ఈ విషయాన్ని ఐసీసీకి తెలిపినట్లయితే తిరస్కరణకు గురయ్యేఅవకాశాలు లేకపోలేదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించారు. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌ను నిషేధించే అవకాశం బీసీసీఐకి లేదని ఆయన తెలిపారు.ఐసీసీ రాజ్యాంగం ప్రకారం కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఈవెంట్లలో నిర్దేశించిన అన్ని జట్లుతో ఆడాల్సిందే.ఒకవేళ ఐసీసీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా పరిగణిస్తే టీమిండియాకే ఎక్కువ నష్టం కలుగుతుంది.2021లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది.ఇదే విషయమై శుక్రవారం పాలకుల కమిటీ సమావేశం జరుగుతుంది. తరువాతగాని ఈ విషయం మీద పూర్తి స్పష్టత రావచ్ఛు.
మ్యాచ్‌ను రద్దు చేసుకొంటే టీమిండియాకే నష్టం : బీసీసీఐ
Post navigation
Posted in: