నాకు స్ఫూర్తి నువ్వే!

ఈ మధ్య కాలంలో టీంఇండియా క్రికెట్‌ జట్టు మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ క్రీడాకారులను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. చహల్‌ టీవీ పేరుతో యాంకర్‌ పాత్ర పోషిస్తూ భారత క్రికెటర్ల ఇంటర్వ్యూలు తసుకుంటున్నాడు. అలాగే న్యూజిలాండ్‌తో నాల్గో వన్డే సందర్భంగా రోహిత్‌ శర్మను కూడా ఇంటర్య్యూ చేస్తూ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చాలని చాహల్ కోరాడు. అయితే నాల్గో వన్డేలో భారత్‌ తరఫున ఆడిన ఆటగాళ్లు చేసిన పరుగులతో చాహల్ అత్యధిక స్కోరు చేయడంతో.. తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలని, కోహ్లి స్థానంలో తనను పంపాలంటూ రోహిత్‌ను ఇంటర్వ్యూలో సరదాగా అడిగాడు.

అయితే తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టీ 20లో భారత మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన టాప్ స్కోరర్ గా నిలిచింది.. ఈ సందర్భంలో చహల్‌ ఇంటర్య్యూ చేయగా… నా బ్యాటింగ్‌కు నువ్వే స్ఫూర్తి అని చహల్‌తో మంధాన చమత్కరించారు. నా బ్యాటింగ్‌ను చూసి ఏమైనా నేర్చుకున్నారా అని చహల్‌ అడిగిన ప్రశ్నకు, మంధానా సరదాగా సమాధానం చెప్పారు. “అవును.. నా బ్యాటింగ్‌కు  నువ్వే స్ఫూర్తి”. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌పై నువ్వు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటినుంచి నా గేమ్‌ను ఇంకా మెరుగుపరుచుకోవాలనుకున్నా. నేను స్ఫూర్తిగా తీసుకొనే క్రికెటర్లలో నువ్వు ఒకడివి. నేను బ్యాటింగ్‌కు వెళ్లే క్రమంలో నీ ఆట తీరును గుర్తు చేసుకుంటానని, చాహల్ చేసిన ఇంటర్వ్యూలో మంధాన తెలిపింది.

leave a reply