టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ధోనీపై భారత బౌలర్ కుల్‌దీప్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ధోనిలో ఎన్నో నైపుణ్యాలున్నాయని, అతడి దగ్గనుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలియచేసాడు. స్టంప్స్ వెనకాల ఉండి అంత వేగంగా స్పందించే క్రికెటర్‌ను తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని అంటున్నాడు. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ధోనీ ప్రస్తావన తీసుకొచ్చాడు.
మహీ భాయ్‌కు ఎంతో అనుభవం ఉంది. ఆటలోని చాలా కీలకాంశాలను ఆయన మాకు ఎప్పుడూ వివరిస్తూ ఉంటాడు. కీలక సమయాల్లో వికెట్లు ఎలా తీయడంలో మాకు కొన్ని మెళుకువలు నేర్పిస్తాడు అవి జట్టు విజయంలో ఎంతో కీలకం. ఆయన గేమ్ చేంజర్ లాంటి వాడు.మా జట్టులో ధోనీ ఉన్నందుకు మేమెంతో అదృష్ణవంతులం. ఆయనలో నేనొక అద్భుతమైన లక్షణాన్ని చేసాను. స్టంప్స్ దగ్గర అంత వేగంగా స్పందించే అతగాడిని నేనెక్కడా చూడలేదు. కీపింగ్‌లో అంత చురుగ్గా ఉండే ఇతర ఆటగాళ్లతో నేనెప్పుడూ ఆడింది లేదు’ అని పేర్కొన్నాడు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ధోనీ కేవలం వ్యవహరించి 0.09సెకన్లలో కివీస్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌ను స్టంప్ ఔట్ చేసి అందరిని ఆశర్యపరిచాడు. అయితే అది కుల్‌దీప్ బౌలింగ్‌లోనే జరగడం విశేషం. ధోనీ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం వన్డే ఫార్మాట్‌లో 119, టీ20లో 34 స్టంపింగ్స్ చేయడం గమనార్హం.