రికార్డులతో.. టీమిండియా బ్యాట్స్‌మెన్‌

వరుస రికార్డులతో  టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ దూసుకుపోతున్నాడు. తాజాగా టెస్టు కెరీర్‌లో మరో అరుదైన మరో ఘనతను సాధించాడు. ఒక సంవత్సరంలో   విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో తొలి స్థానం సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరుమీద ఉంది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137 పరుగులు చేశాడు. తరువాత  దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కలిపి కోహ్లీ 1138 పరుగులు చేశాడు. ద్రవిడ్‌ కంటే ముందు భారత క్రికెటర్ల జాబితాలో మొహీందర్‌ అమర్‌నాథ్‌ (1065), సునీల్ గావస్కర్‌ (918)లు  తర్వాత స్థానాల్లో ఉన్నారు. అయితే టెస్టుల్లో కోహ్లీ వ్యక్తిగతంగా ఇంకో మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రిలియాతో జరుగుతున్న మూడో టెస్టుతో తన టెస్టు కెరీర్‌లో అత్యధిక పరుగుల్ని ఆసీస్‌పైనే సాధించిన రికార్డును అందుకున్నాడు. ఆసీస్‌ జట్టుమీద 1573 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు చేశాడు.

మరోవైపు ఆస్ట్రిలియాతో జరుగుతున్న మూడో టెస్టులో  పుజారా శతకంతో విజృంభించాడు. తన టెస్టు కెరీర్‌లో 17 శతకాన్ని నమోదు చేసుకున్న పుజారా   ఈ ఏడాది మూడు శతకాలు నమోదు చేశాడు.అయితే పుజారా ఈ మ్యాచ్ తో రికార్డ్ సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక అర్ధ సెంచరీలను సెంచరీలు చేసిన భారత మూడో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు.  ఈ ఘనత సాధించిన ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లో పుజారా మూడోస్థానంలో నిలవగా, టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రెండో స్థానంలో నిలిచాడు.

leave a reply