టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్రంగా ఖండించిన విరాట్ కోహ్లీ… పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఈ సమయంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం సరైనది కాదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్పీ-ఎస్‌జీ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ అవార్డులను అందజేస్తారు. ఈ మేరకు కోహ్లీ ట్విటర్‌లో తెలిపాడు.
అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉండగా. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ‘ఆర్పీ-ఎస్జీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జరపడం సబబు కాదనే ఉద్దేశంతోనే కోహ్లి ఈ కార్యక్రమాన్ని నిలిపివేసాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ అవార్డులను మొత్తం ఐదు విభాగాల్లో క్రీడాకారులకు అందజేస్తారు.
ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడి చోటుచేసుకోగానే దేశం మొత్తం తీవ్రంగా ఖండించారు. పలువురు క్రికెటర్ల సైతం ఈ సంఘటనను ఖండించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కోహ్లీ వివరించాడు.