తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉంది.

చరిత్ర ప్రకారం.. లక్ష్మీదేవి, విష్ణు మూర్తి ఏకాంతంలో ఉండగా.. భృంగ మహర్షి విష్ణు మూర్తిని మూడు సార్లు పిలవగా ఆయన పలకకపోవడంతో కాలితో లక్ష్మీదేవి నివాసమైన వక్ష స్థలంపై తంతాడు. దానితో కోపగించుకున్న లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తుంది. లక్ష్మీదేవిని వెతుకుతూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చేస్తారు. ఎంత వెతికినా లక్ష్మీదేవి కనిపించకపోయే సరికి వెంకటగిరి కొండపై ఆకలి, దప్పికలతో అలమటిస్తూ చీమలపుట్టలో ఉండేవాడు. ఒకసారి అటుగా వెళ్లిన ఆవు ఆయన ఆకలిని గ్రహించి తీర్చుతుంది. అలాగే..రోజూ వచ్చి ఆయన ఆకలిని తీర్చుతూ ఉండగా, కాపలాదారుడికి అనుమానమొచ్చి ఆవును కొట్టగా.. ఆ దెబ్బ వెంకటేశ్వర స్వామికి తగులుతుంది. అది గ్రహించిన రాజు చీమలపుట్ట వద్దకు వచ్చి చూస్తాడు. అప్పుడు సేవకుడు తప్పు చేసినందువల్ల, రాజును రాక్షసుడు కమ్మని శపిస్తాడు. రాజు తను అమాయకుడినని వేడుకొన్నప్పుడు, ఆకాశ రాజుగా జన్మించాలని మరియు పద్మావతితో వివాహం చేసుకున్న సమయంలో ఆకాశరాజు సమర్పించిన కిరీటంతో విష్ణువును అలంకరించినప్పుడు ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు. అనంతరం పద్మావతితో వివాహం చేసుకుని అక్కడే కలియుగ వెంకటేశ్వరుడుగా కొలువుతీరతాడు.

ఈ ఆలయంలో రోజూ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అవి.. సుప్రభాత సేవ, శుద్ధి, తోమాలసేవ, కొలువు, సహస్రనామార్చన. మొదటి గంట నైవేద్యం, అష్టోత్తర శతనామార్చన, రెండో గంట నైవేద్యం, రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ, ముత్యాల హారతి, గుడిమూసే ప్రక్రియ కార్యక్రమాలు. అలాగే కాలిబాట వచ్చే భక్తులకు తొందరగా స్వామి వారి దర్శనం అయ్యేటట్టు చూస్తారు.

leave a reply