భక్తులకు….హెచ్చరిక!

అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ కొన్ని సూచనలను చేసింది.  దేశవ్యాప్తంగా శబరిమలకు రైలులో వచ్చే అయ్యప్ప భక్తులు స్వామి పేరిట బోగిల్లో దీపం గాని, హారతి కర్పూరం వంటివిగాని  వెలిగించడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితులలో అయినా ఈ నియమాలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

దేశం నలుమూలల నుంచి శబరిమలకు అయ్యప్ప భక్తులు వస్తుంటారు వీరు ఎక్కువగా  రైలులోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే ప్రయాణానికి రెండు మూడు రోజుల పైగా సమయం పడుతుండడంతో అయ్యప్ప భక్తులు స్నానాలు పూజలు భోగిల్లోనే చేస్తుంటారు. కానీ ఇప్పుడు రైల్వే శాఖ బోగీల్లో పూజల్లో ఉపయోగించే కర్పూరంను వెలిగించవద్దని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అయ్యప్ప భక్తులు మాత్రం రైల్ లో నిప్పు వెలిగించడం ప్రమాదకరమే అయినప్పటికీ తమ సంప్రదాయాలు గౌరవించాలని భక్తులు కోరుతున్నారు. రైల్వే శాఖ మాత్రం దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్న కారణంగా ఎటువంటి  ప్రమాదాలు  జరగకుండా ఉండేందుకు కర్పూరం వెలిగిస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని, దాంతోపాటు 3 ఏళ్లు జైలుశిక్ష పడుతుందని హెచ్చరిస్తూ.. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తరలించవద్దని ఆదేశాలు జారీ చేసింది.

leave a reply