ఆటను ఆస్వాదించనివ్వండి…సచిన్!

TAURANGA, NEW ZEALAND - FEBRUARY 03: Captain Prithvi Shaw and Shubman Gill of India (L-R) hold the trophy after the win in the ICC U19 Cricket World Cup Final match between Australia and India at Bay Oval on February 3, 2018 in Tauranga, New Zealand. (Photo by Kai Schwoerer-IDI/IDI via Getty Images)

టీమిండియా యువ క్రికెటర్లు పృథ్వీ షా, శుభమన్‌ గిల్‌‌ ఇటీవలి కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టగా… వారు ఆటను ఎంజాయ్‌ చేయాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో గాయం కారణం సిరీస్ మొత్తానికి పృథ్వీ షా దూరమవగా, న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వగా శుభమన్ గిల్‌కి అవకాశం దక్కింది.. అయితే రెండు మ్యాచ్ లలో అతను విఫలమవడంతో అభిమానులు అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా…యువ క్రికెటర్‌కి సచిన్ మద్దతు తెలిపాడు.

పృథ్వీ షా ఆటతీరు గురించి సచిన్ మాట్లాడుతూ… 8-9ఏళ్ల వయసులో అతని ప్రాక్టీస్‌ చూసి తప్పకుండా భారత్ జట్టుకి ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాను దీని గురించి ఇంతకముందే మాట్లాడాను. శుభమన్ గిల్ కూడా అండర్-19 ప్రపంచకప్‌లో షాతో కలిసి అత్యుత్తమప్రదర్శన చేసాడు. ఇద్దరిలోనూ అపారమైన ప్రతిభ ఉంది. కాకపోతే.. ఇటీవలే వారు భారత్ జట్టులోకి అరంగేట్రం చేశారు కాబట్టి కొన్ని రోజులు వారి ఆటను ఆస్వాదించండి అని సచిన్ చెప్పాడు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం ఉదయం 12.00 గంటలకి రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

leave a reply