మెరిసిన మయాంక్‌…విఫలమైన తెలుగు కుర్రాడు!

ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్:215/2.  మెల్‌బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో  భారత్‌ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లలో హనుమ విహారి (8)తొలి వికెట్ త్వరగానే కోల్పోయిన తరవాతి బ్యాట్స్‌మన్‌ ఫరవాలేదనిపించారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌ అర్ధశతకంతో తనదైన ముద్ర వేసాడు. చతేశ్వర పుజారా( 200 బంతుల్లో 68 బ్యాటింగ్‌: 6 ఫోర్లు), విరాట్‌ కోహ్లి (107 బంతుల్లో 47 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే మూడో వికెట్‌కు  92 పరుగులు జోడించారు. అంతకు మందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ప్రయోగాత్మకంగా మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారీలను ఓపెనర్లుగా బరిలోకి దింపింది.

అరంగేట్ర టెస్ట్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన  భారత  ఏడో బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ గుర్తింపు పొందాడు. నిలకడగా ఆచితూచి ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్లిన మయాంక్‌(161 బంతుల్లో 76: 8 ఫోర్లు, 1 సిక్స్‌)ను ప్యాట్‌ కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బాటింగ్ కి దిగిన విరాట్ కోహ్లీ పుజారాతో జత కలిసి మరో వికెట్ నష్టపోకుండా జాగ్రత్త స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే అవకాశాన్ని మయాంక్‌ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు తనపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రారంభంలో దాటిగా ఆడిన కోహ్లి.. అనంతరం నెమ్మదించాడు.  ఈ క్రమంలో 152 బంతుల్లో 4 ఫోర్లతో పుజారా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి కూడా హాఫ్‌ సెంచరీ చేరువగా వచ్చినప్పటికి తొలి రోజు ఆట ముగిసింది.

leave a reply