ఊహించని రీతిలో..టీమిండియా ఓటమి!

ఆస్ట్రిలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఊహించని రీతిలో ఓటమి  పాలైంది . నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోభాగంగా ఒప్టస్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ పేలవ ప్రదర్శనతో  పరాజయం చవి చూసింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేనకు ఓపెనర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్చేయడంతో టీమిండియా 140 పరుగులకు అల్ఔట్ అయింది. బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మన్స్ చేతులెత్తేశారు.మొదటి ఇన్నింగ్స్ లో కొంచం పరవాలేదనిపించిన రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా రాణించలేకపోయారు.  ఫలితంగా భారత్ 146 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో నాలుగుమ్యాచ్‌ల సిరీస్ 1-1తో ఆస్ట్రిలియాసమం చేసింది.

ఓవర్ నైట్ స్కోరు112/5తో ఐదో రోజు బ్యాటింగ్కొనసాగించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 28 పరుగులు చేసిన  విహారిని స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు.మరోక బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కాసేపుపోరాడిన  ఫలితం లేకుండా పోయింది. 30 పరుగులు చేసిన అతడు.. లియాన్ బౌలింగ్‌లో ఏడోవికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్స్ ఎవరు క్రీజ్ లోఎక్కువ సేపు నిలవలేక పోయారు. తక్కువ స్కోరుకే మిగిలిన ముగ్గురు  అవుటవడంతో భారత్ 140 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాట్స్‌మన్లలో పంత్ 30, రహానే 30,విహారి 28, విజయ్ 20, కోహ్లీ 17 మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లియాన్ తలో మూడు, కమ్మిన్స్,హజెల్‌వుడ్ తలో రెండువికెట్లు పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతమైన బౌలింగ్ వేసిన లియాన్‌కుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే మూడో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది.

leave a reply