బొప్పాయితో ఆరోగ్యం!

ఇంగ్లిష్‌లో ‘ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్’గా పిలిచే బొప్పాయితో శరీరానికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు. బొప్పాయిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిలో కేరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ కె అధిక శాతంలో ఉంటాయి. అంతేకాక దీనిలో పీచు పదార్థం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయి. బొప్పాయి వల్ల లభించే ప్రయయోజనాల గురించి తెలుసుకుందాం. 

జీర్ణ సంబంధ సమస్యతో బాధపడుతున్న వారికీ బొప్పాయి మేలు చేస్తుంది. వీటిలో అల్సర్లను తగ్గించే గుణాలుంటాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకుంటున్న వారికి బొప్పాయి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో పీచుపదార్థాలు అధికంగా ఉంటూ, కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు.

బొప్పాయి రోగనిరోధక శక్తి పెంచడమే కాక, ఇందులోని పపైన్, కిమోపపైన్ ఎంజైమ్‌లు కడుపులో మంటను తగ్గిస్తాయి.  బొప్పాయిలో ఉండే ఈ విటమిన్లు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వల్ల  రోగనిరోధక వ్యవస్థ సరిగా పని చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల జలుబు, ఫ్లూ ధరి చేరవు.

బొప్పాయి తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. చర్మ సంరక్షణకు బొప్పాయిని ఉపయోగిస్తే సరి. దీన్ని చర్మానికి రాసుకుంటే.. పపైన్ అనే ఎంజైమ్ వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టి శరీరం కాంతివంతం అవుతుంది. బొప్పాయి చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. 

leave a reply