చిక్కువీడని ఆయేషా మీరా మిస్టరీ కేసు..!

గత 18 సంవత్సరాలుగా చిక్కువీడని ఆయేషా మీరా హత్యాచారం కేసు.. ముందు ఈ హత్య సత్యం బాబునే చేశాడని నిరూపించి శిక్ష వేశారు. కాని గతేడాదినే సత్యం బాబు నిర్థోషి అని తీర్పునిచ్చింది కోర్టు. కాగా.. ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసి హైకోర్టు గత నెలలో ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే..

అయితే.. తాజాగా.. కోర్టులో భద్రపరిచిన సాక్ష్యాల ధ్వంసం వ్యవహారంలో విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ముగ్గురు ఉద్యోగులు కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు, దోషులను రక్షించేందుకు యత్నించారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అయితే.. ముగ్గురు కోర్టు ఉద్యోగులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. త్వరలోనే ఆయేషా మీరా తల్లిదండ్రులు, సత్యంబాబును విచారించనుంది.

leave a reply