తిరిగిచ్చేసిన…రిషబ్..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మాటల యుద్ధం కొనసాగుతుంది. రిషబ్ పంత్ బాటింగ్ చేసే సమయంలో ఆసీస్ కెప్టెన్ నోరుపారేసుకున్న సంగతి తెలిసిందే.. దీనికి ఏమాత్రం తగ్గకుండా రిషబ్ అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. శుక్రవారం రిషబ్ ఫై ” వన్డేలకు టీ20లకు ధోని వచ్చాడుగా నువ్వేం చేస్తావ్ ” అని విమర్శించిన పైన్ కు ఇవాళ పంత్ ఘాటుగా “నువ్వెప్పుడైన తాత్కాలిక కెప్టెన్ ని చూసావా మయాంక్… ఇతడే మన అతిధి.. ఆయనకు మాట్లాడటమే తెలుసు.. తడిని అవుట్ చేయదని మనం ఎం కష్టపడాల్సిన అవసరం లేదు “అని బహదులిచ్చాడు.అయితే నాలుగవ రోజు అట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ :258 పరుగులు చేయగలింది. కాగా ప్రస్తుతం టీమిండియా 141 పరుగులు ఆధిక్యంలో ఉంది.

నాలుగవ రోజు 54/5 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 52 పరుగులు జోడించి 106/8 స్కోర్‌ వద్ద డిక్లేర్డ్‌ ఇచ్చింది. అనంతరం 399 పేరుగల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే ఓపెనర్ ఫించ్ వికెట్ బుమ్రాకు చిక్కింది. అయితే ఇన్నింగ్స్ ఆసాంతం ఆసక్తిని రేపిన చివరకు రేపటికి వాయిదా పడింది. భారత విజయాన్ని ఆసీస్ బౌలర్లు ప్యాట్‌ కమిన్స్‌ (61), నాథన్‌ లయన్‌(6)లు అడ్డుకున్నారు. కమ్మిన్స్ ఆచితూచి ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కమిన్స్‌ 86 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో కెరీర్‌లో రెండో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఇక మ్యాచ్‌ ఫలితం కోసం అంపైర్లు ఆటను అరగంట పొడిగించినా ఈ జోడి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత్‌ విజయం కోసం రేపటి వాయిదా పడింది.

leave a reply