‘దేవి’ పేరు ఎత్తక పోవడానికి కారణం అదేనా..!

వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సందేహాలకు తెరతీశారు. పేరుకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా దాదాపు ఆడియో ఫంక్షన్ లాగానే సాగుతుండే ఆ ఫంక్షన్లలో సంగీత దర్శకుడు, అతని సంగీతం ప్రధానమైన హైలెట్ గా ఉంటుంది. అటువంటిది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలని చేశాడో లేక మరచిపోయాడో తెలియదు కానీ, సినిమా సంగీత దర్శకుడైన దేవి శ్రీ ప్రసాద్ తను మాట్లాడిన దానిలో ఎక్కడా  ప్రస్తావించలేదు.

దానికి సినీ విశ్లేషకులు చెబుతున్న కారణం ఏమిటంటే.. గతంలో జల్సా, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ తో పని చేసిన త్రివిక్రమ్ ఇటీవలి కాలంలో దేవిశ్రీ తో పనిచేయడం లేదట. “అ ఆ” సినిమాకి మిక్కీ జె మేయర్, అజ్ఞాతవాసికి అనిరుద్, అరవింద సమేతకి తమన్ లని సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు మాటల మాంత్రికుడు.

చిన్న సినిమాగా తెరకెక్కిన అఆ కి ముందుగా దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నారని, అయితే దేవిశ్రీ ఆ సినిమాకి పని చేయడం కోసం కుమారి 21 ఎఫ్ సినిమా తరహాలో భాగస్వామ్యం కోరాడని, దీంతో హర్ట్ అయిన త్రివిక్రమ్ అప్పటినుండి దేవిశ్రీప్రసాద్ ని తన సినిమాలకు తీసుకోవడం మాని వేశారని ఒక రూమర్ ప్రచారంలో ఉంది. ఆ రూమర్ ఎంత వ్యాప్తి చెందినప్పటికీ దీనిపై అటు త్రివిక్రమ్ కానీ ఇది దేవిశ్రీ కానీ ఎప్పుడూ స్పందించలేదు.

కానీ, వినయ విధేయ రామ ఫంక్షన్ లో త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడి ఆ రూమర్స్కి ఫుల్ స్టాప్ పెడతారేమో అనుకున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు దేవిశ్రీ గురించి ప్రస్తావన చేయకుండా తన ఉపన్యాసాన్ని ముగించారు.

leave a reply