21 కోట్లా.. వామ్మో పులస చాలదేమో

ఏంటి న‌మ్మ‌లేక‌పోతున్నారా ? కానీ అదే నిజం. మామూలుగా చేపలు కిలో రూ.100 నుంచి 500ల మధ్య ఆయా చేపలను బట్టి ఉంటుంది. అదే పులస అయితే దగ్గరదగ్గరగా కిలో ఓ రూ.10వేలు ఉంటుంది. కానీ ఏకంగా ఈ చేప రూ.21కోట్లు ఏంటనుకుంటున్నారా.. అంతే ఇదిగా దీని రుచి మహత్యం ఉంటుందని అంటున్నారు జపనీయులు. ఇంతకీ ఈ చేప పేరేంటని ఆలోచిస్తున్నారా..? ఆ.. అక్కడికే వస్తున్నాం.. ఈ చేప పేరు బ్లూఫిన్ టునా.

జపాన్‌లో టునా చాలా పాపులర్‌ ఫిఫ్‌.. మన గోదావరిలో పులసకి ఎంత ప్రాధాన్యం ఉందో జపాన్‌లో అలా అన్నమాట. చేపల్లోనే అద్భుతమైన రుచి ఈ ఫిష్‌ సొంతం. అందుకే ఈ చేపను రూ.21 కోట్లకు `కిమురా’ అనే హోటల్‌ యజమాని సొంతం చేసుకున్నారు. 278 కిలోల బ‌రువు ఉన్న ఈ చేపను సుమారు 333.6 మిలియ‌న్ల యెన్‌లు (భారతీయ కరెన్సీలో రూ.21 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నాడు.

ఈ చేపలు ఎక్కువగా సముద్రంలో తక్కువ సంఖ్యలో దొరుకుతాయి. కాబట్టి ఈ చేపలను ఏటా న్యూయర్‌ రోజున వేలం వేస్తూంటారు. ఈ చేప ఒక ముక్క ధర వేలల్లో ఉంటుంది. జ‌పాన్‌ ఫిష్ మార్కెట్‌‌లో వున్న అన్ని చేపల్లో రారాజు ఈ బ్లూఫిన్ టునానే. బ్లూఫిన్ టునా తర్వాతే ఏ చేప అయినా. పోయిన సంవత్సరం ఈ చేప ధర రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సంవత్సరం అంతకు రెట్టింపులో పోటీ పడి మరీ కొనుగోలు చేశారు.

leave a reply