‘ఉక్కు’ కష్టం..

కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకై ఎంపీ సీఎం రమేష్‌ అమరణనిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ప్రాణాలమీదకు వచ్చినా సీఎం రమేష్‌ దీక్ష విరమించకపోవడంతో.. సీఎం చంద్రబాబు స్పందించి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఫరవాలేదు.. ఉక్కు పరిశ్రమను రాష్ట్రప్రభుత్వమే నిర్మిస్తోందని చంద్రబాబు మాట ఇచ్చారు.

కాగా.. ఈ విషయంపై సీఎం రమేష్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న ఈ అంశాన్ని నెరవేర్చాలంటూ తాను, బీటెక్‌ రవి చేసిన నిరాహార దీక్షలకు రాష్ట్ర, జిల్లా ప్రజలు మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి విన్నవించినా ఆయన స్పందించలేదని విమర్శించారు. జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలూ హాజరవ్వాలని కోరారు. ఉక్కు కర్మాగారం అనంతరం తాను తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పిస్తానని తెలిపారు.

leave a reply