సైకిల్‌ దెబ్బకు కారుకు సొట్టలు

ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? దేనితో ఈ సైకిల్‌ తయారు చేశారబ్బా..? అని అందరినీ ఆశ్యర్యనికి గురిచేస్తుంది సైకిల్‌. ప్రస్తుతం ఈ వార్త ఆన్‌లైన్‌లో  ఫుల్లుగా పాపులర్‌ అవుతుంది. ఎక్కడైనా సైకిల్‌ గుద్దితే కారుకు సొట్టలు పడతాయా అని అందరూ షాక్‌ అవుతున్నారు. సైకిల్‌ దెబ్బకి కారు ముందుభాగం సొట్టలు పడినా.. సైకిల్‌కు మాత్రం చెక్కు చెదరకుండా కనిపిస్తుంది.

అయితే.. అసలు ఇది నిజామేనా అని నెటిజన్‌లు సందేహపడుతున్నారు. కాగా.. ఈ వార్త నిజమే అంటూ చైనా పోలీసులు తెలిపారు. దక్షిణ చైనాలోని షెంఝెన్‌లో ఈ ప్రమాదం జరిగిందని, సైకిల్‌ నడిపిన వ్యక్తికి గాయాలు కూడా అయ్యాయని, కాకపోతే కారు ముందు భాగమే దెబ్బతిన్నదని, ఈ కేసును పరిశీలిస్తున్నట్లు చైనా పోలీసులు ఫైనలైజ్‌ చేశారు.

leave a reply