ఎన్నికలకు.. రూ. 2 వేలకోట్లు కావాలి

నిజంగా.. సినిమాలు నాకు తృప్తిని ఇవ్వకే.. నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. పక్కోడి సమస్యలను తీర్చడంలోనే అసలైన కిక్కు, సంతోషం ఉంటాయని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అయితే.. ఈ మధ్య నేతలు నాతో కొన్ని విషయాలు చర్చించారు.. అందులో ముఖ్యమైనది రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని తనతో అన్నారని పవన్‌ అన్నారు. అధికార ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు ఇప్పటికే ఆ పనిలోనే ఉన్నారన్నారని తనకు తెలిపారని చెప్పారు.

ప్రజల హృదయాలు గెలుచుకోవటానికి డబ్బుతో పని, అవసరం రెండూ లేవని అన్నారు. తనకు కాన్షీరామే మార్గదర్శి అని చెప్పారు. అయినా.. నేను సినిమాల్లోకి రాకముందు నుంచే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని.. అన్నీ చూసి, తెలుసుకునే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగిందని పవన్‌ అన్నారు. పూర్తిగా రాజకీయాల గురించి, రాజకీయుల్లాంటి మనుషుల గురించి తెలుసుకున్నాకే ప్రశ్నించడం మొదలు పెట్టా అన్నారు.

నిజంగా ఇది చాలా దురదృష్టమైన చర్య అని పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఉంటేనే రాజకీయాల్లో ఉంటారా..? ఇప్పుడు ప్రజలను నమ్మించి మోసం చేసి.. రేపు వారినుంచి రక్తాన్ని పీల్చుకుని తాగుతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

leave a reply