అభిమానుల కోసం

ఆంధ్రప్రదేశ్  పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం తన పర్యటనలో భాగంగా పోలీసు సెక్యూరిటీని దూరం పెట్టారు. తన అనుచరులను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానంటూ పోలీసులను ధీటుగా సమాధానం ఇచ్చారు. పోలీసులు కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని,  టీడీపీ కార్యకర్తలను , నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. గ్రామదర్శినిలో ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు బందోబస్తు లేకుండా నేరుగా చాగలమర్రి, రుద్రవరం మండలాల్లో పర్యటించారు.

తన సొంత అనుచరులపై  పీడీ చట్టం ప్రయోగించారని, కార్డాన్ సర్చ్ పేరుతో భాధిస్తున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వం తనకు ఏర్పరచిన భద్రతను తురస్కరించి పోలీసులపై అసహనం వ్యక్తం చేసారు. మంత్రి సొంత సెక్యూరిటీతోనే మావోయిస్టుల ప్రభావం ఉన్న కర్నూలు జిల్లా రుద్రావరం మండలంలో అఖిలప్రియ పర్యటించారు. మొత్తానికి ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

leave a reply