ఎలక్షన్ కోడ్ ఉండగా.. క్యాంపయిన్..!

నారా రోహిత్ సిని కెరీర్ విషయానికి వస్తే..

తెలంగాణలో.. రేపు అనగా శుక్రవారం ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా నారా రోహిత్ తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ ద్వారా మహా కూటమికి ఓటేయమంటూ కోరారు. ముఖ్యంగా కుకట్ పల్లి నియోజక వర్గ ఓటర్లను..తమ ఓట్లు వేసి నందమూరి సుహాసిని గెలిపించమని కోరారు. ఆయన నిన్నటి దాకా తన అఫీషియల్ ఎక్కౌంట్ ద్వారా క్యాంపైన్ చేసారు. టీఆర్ఎస్ కు వ్యతికేరంగా ఆయన ఓటు వేయమంటూ పోస్ట్ లు పెట్టారు. ఏ నటుడు కూడా ఇంత డైరక్ట్ గా తమ అఫీషియల్ సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా ఇలా ఎన్నికల ప్రచారం చేయలేదు. ఇక నారా రోహిత్ ఇలా ప్రచారం చేయటానికి కారణం. ఆయన చంద్రబాబు నాయుడు అన్న నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు కావటమే.

నారా రోహిత్ సిని కెరీర్ విషయానికి వస్తే..

రీసెంట్ గా వీరభోగ వసంత రాయులు చిత్రంతో పలకరించిన నారా రోహిత్ తన తదుపరి చిత్రం లాంచింగ్ రెడి అవుతున్నారు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో ‘నారారోహిత్’ హీరోగా 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి షూట్‌కి వెళ్ళనుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈసారి ఎలాగైనా హిట్‌కొట్టాలని చైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొనిమరీ ఈ సినిమా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

వాస్తవానికి చైతన్య దంతులూరి ‘బాణం’ చిత్రంతోనే దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఆ తరువాత ‘బసంతి’తోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. చైతన్య దంతులూరికి మాత్రం సరైన సక్సెస్ దక్కలేదు.

ఆ లోటును ఈసారి ఎలాగైనా తీర్చుకోవాలని.. ఇప్పుడు చెయ్యబోయే సినిమాతో భారీ సక్సెస్ కొట్టాలని చైతన్య దంతులూరి ఈ పీరియాడిక్ స్టోరీని ఎంచుకున్నాడు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

leave a reply