బాబాయ్‌.. అదరగొట్టావ్‌..

అమెరికా పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ‘నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు.. రోజూ భయాన్ని ఎదుర్కోవడం. నా జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా…’ అంటూ ఆయన అన్నారు.

కాగా.. పవన్‌పై కామెంట్స్‌పై హీరో రామ్‌చరణ్‌ స్పందిస్తూ.. పవన్‌ ఒక గొప్ప నాయకుడని అన్నారు. ‘భయాన్ని అధిగమించాలంటే మిమ్మల్ని భయపెట్టే పనినే రోజూ చేయండి. భయంలోని మార్పును ఎదుర్కోలేకపోవడమే పెద్ద భయం. నేను ఇంత వరకూ ఎప్పుడూ ఇలాంటి మాటలను వినలేదు. బాబాయ్‌ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. అంటూ పవన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

leave a reply